కూటమిని గెలిపించండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్

-

కూటమిని గెలిపించండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి అని జనసేనాని అన్నారు.ఆటో డ్రైవర్లను వేదించని ప్రభుత్వం, ఆటో డ్రైవర్లకు అండగా నిలబడే ప్రభుత్వం రానుంది అని తెలిపారు. డ్రైవర్లు నుండి వెయ్యి కోట్ల పెనాల్టీలు టార్గెట్ పెట్టుకుని 300 కోట్ల వాహన నేస్తం పథకం ఇస్తున్నారు అని మండిపడ్డారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టని ప్రభుత్వం రాబోతుంది.కూటమి అభ్యర్థులను గెలిపించండి, నేను పని చేస్తాను, ఎమ్మెల్యే లతో పని చేయిస్తాను అని మాటిస్తున్నాను అని ఆయన హామీ ఇచ్చారు.

యువత భవిష్యత్తు కోసం అంబటి రాయుడు లాంటి యువకుడు ముందుకు వచ్చాడు, ఆయన్ను గుండెల్లో పెట్టుకుంటాం, వైసీపీ నాయకుల్లగా బానిసగా చూడం.మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి గారికి బ్యాలెట్ నెంబర్ 6, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అని కోరారు.అలాగే అవనిగడ్డ ఎమ్మెల్యే గా మండలి బుద్ధ ప్రసాద్ గారిని బ్యాలెట్ నెంబర్ 6, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అని కోరుతున్నాను అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news