IND VS ZIM : డ్రెస్సింగ్ రూమ్ లో టీమిండియా ప్లేయర్ల రచ్చ రంబోలా…వీడియో వైరల్‌

-

జింబాబ్వే తో వన్డే సిరీస్ ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన మూడోది మరియు చివరిదైన మ్యాచ్ లో భారత్ 13 పరుగుల తేడాతో జింబాబ్వే ను ఓడించింది. ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ప్లేయర్లు తెగ సంబరాలు చేసుకున్నారు.

డ్రెస్సింగ్ రూమ్ లో చిందులేశారు. ఈమధ్య సోషల్ మీడియాను వైరల్ అయిన నార్వే గ్రూపు డ్యాన్స్ ను అనుకరిస్తూ, ప్లేయర్లందరూ కధం తొక్కారు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ‘కాలా చష్మ’ కు అదిరిపోయే స్టెప్పులేస్తూ సిరీస్ విజయాన్ని ఆస్వాదించారు.

భారత సంబరాలు వీడియోను వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ తన ఇన్స్టా లో పోస్ట్ చేశాడు. ‘మేము మా విజయాన్ని ఇలా జరుపుకున్నాం’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. కాగా… ఈ నెల 27 వ తేదీ నుంచి టీమిండియా ఆసియా కప్ ఆడనుంది.  ఈ టోర్నీలో పాక్ తో రెండు సార్లు తలపడనుంది.

Read more RELATED
Recommended to you

Latest news