శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పార్లమెంట్ విడుదల చేసింది. దీంతో ఈ శీతాకాల సమావేశాలల్లో అధికార పార్టీ అయిన బీజేపీ ని ఎలా ఇరికించాలని ప్రతి పక్ష పార్టీలు సమా ఆలోచనలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రైతు సమస్యల తో పాటు లఖీంపూర్ ఘటన పై చర్చ కు పట్టు పట్టే అవకాశం ఉంది.
లఖీంపూర్ ఘటన కు కారకుడు అయిన కేంద్ర మంత్రి ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. అలాగే నామ మాత్రంగా తగ్గించిన పెట్రోల్, డిజిల్ ధరల పై కూడా సభ లో చర్చ కు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మే లీటర్ పెట్రోల్ పై రూ. 110 వరకు పెంచి నామ మాత్రంగా రూ. 5 తగ్గించడం ఎంటి అని ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే డ్రగ్స్ సరఫరా తో పాటు పొరుగు దేశం అయిన చైనా తో సరిహద్దు వివాదం వంటి వాటి పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా వరి ధాన్యం వివాదం నడుస్తున్న సమయంలో టీఆర్ఎస్ ఎంపీ లు ఈ పార్లమెంట్ సమావేశాలలో ఎ విధంగా ఉంటారు అనే ప్రశ్న కూడా ఉత్పన్న అవుతుంది. అయితే ఈ విషయం లో కేంద్రాన్ని నిలదీస్తారా.. లేక ఎప్పటి లాగే మోడీ కి జై కొడుతారా అనేది వేచి చూడాలి.