ఉండాల్సిన దానికంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు బరువు పెరగాలని అనుకుంటుంటారు. దాని కోసం చాలా రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం జరుగుతుంది. అయితే నాచురల్ గా బరువు పెరగడం కొంచెం కష్టమే కానీ ఈ విధంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. అయితే బరువు పెరగాలనుకొనే వాళ్లు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే బరువు పెరుగుతారు అనేదాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.
రెడ్ మీట్:
మాంసం తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి వీలు అవుతుంది. అందులో కొలెస్ట్రాల్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. అలానే ఫ్యాట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు రెడ్ మీట్ ని డైట్ లో తీసుకుంటే ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు పెరగడానికి వీలవుతుంది.
పీనట్ బటర్:
పీనట్ బటర్ కూడా బరువు పెరగడానికి వీలవుతుంది. పైగా దీని రుచి కూడా బాగుంటుంది. పోషక పదార్థాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అలాగే క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ ఇ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి.
పాలు:
పాలు తాగడం వల్ల కూడా బరువు పెరగడానికి వీలవుతుంది. సన్నగా ఉన్నవాళ్లు పాలను రెగ్యులర్ గా తీసుకోండి. మీరు పాలని తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా 60 కేలరీలు మీకు అందుతాయి. పైగా పాలల్లో విటమిన్స్ మరియు పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ గా తీసుకోవడం మర్చిపోకండి.
పండ్లు:
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మామిడి పండ్లు, అరటి పండ్లు, బొప్పాయి, పైనాపిల్ వంటివి మీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఎనర్జీ ని ఇన్స్టంట్ గా ఇస్తుంది అదేవిధంగా బరువు పెరగడానికి కూడా వీలవుతుంది.
అవకాడో:
అవకాడో చాలా రుచిగా ఉంటుంది. బరువు పెరగడానికి ఇది బాగా సహాయం చేస్తుంది. అవకాడోలో విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్, పొటాషియం మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
వీట్ బ్రెడ్:
వీట్ బ్రెడ్ కూడా పోషక పదార్థాలతో ఉంటుంది మీరు ఉదయాన్నే అల్పాహారం సమయంలో దీనిని తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి బాగుంటుంది. కాబట్టి బరువు సులువుగా పెరగాలనుకొనే వాళ్ళు వీటిని తీసుకుని ఈజీగా బరువు పెరగడండి.