కరోన మహమ్మారి రాష్ట్రం అంతటా కూడా విజృంభిస్తోంది.రోజు రోజుకీ కరోన కేసులు కూడా భారీగా పెరిగి పోతున్నాయి. గత రెండు రోజుల నుంచి చూస్తుంటే రాష్ట్రంలో పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దీనితో ఆదివారం కర్ఫ్యు విధించారు. ప్రజలని సామాజిక దూరం పాటించమని, మాస్కులు ధరించమని, బయటకు రావద్దని ప్రభుత్వం, అధికారులు, పోలీసులు కూడా ప్రచారం చేస్తున్నప్పటికీ ఫలితం లేక పోయింది. ప్రజల్లో ఏమాత్రం మార్పు కూడా రాలేదు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే.
సోమవారం నాడు భారీ సంఖ్య లో జనం బయటకు వచ్చారు. దీనితో రద్దిగా మారాయి రోడ్లు. కనీస జాగ్రత్తలు పాటించకుండా అధికారుల మాటలు లెక్క చేయకుండా రోడ్డు పైకి రావడం తో కరోన మహమ్మారిని కంట్రోల్ చేయడం మరెంత కీలకంగా మారుతోందని అధికారులు తెలిపారు.