వొడాఫోన్ ఐడియా గుడ్‌న్యూస్‌.. ఫోన్ల‌కు ఇ-సిమ్ స‌పోర్ట్‌..!

-

టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా దేశంలోని ఐఫోన్ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక‌పై వారికి ఇ-సిమ్ స‌పోర్ట్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. ఐఫోన్ 11, 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్‌, ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ ఎక్స్ఎస్‌, ఎక్స్ఎస్ మ్యాక్స్‌, ఎక్స్ఆర్ ఫోన్ల‌కు ఇ-సిమ్ స‌పోర్ట్‌ను అందిస్తున్న‌ట్లు తెలిపింది. త్వ‌ర‌లో శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్‌, ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ల‌కు కూడా ఇ-సిమ్ స‌ర్వీస్‌ను అందివ్వ‌నున్న‌ట్లు తెలియ‌జేసింది. ప్ర‌స్తుతానికి ముంబై, ఢిల్లీ, గుజ‌రాత్‌లో వొడాఫోన్ ఐడియా యూజ‌ర్లు ఇ-సిమ్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

vodafone idea gives eSIM services to iPhone users

ఆపిల్ సంస్థ పైన తెలిపిన త‌న ఐఫోన్ల‌లో గ‌తంలోనే ఇ-సిమ్ సేవ‌ల‌కు స‌పోర్ట్‌ను ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇ-సిమ్ అంటే.. అందులో రెండో సిమ్ వేసుకునే సౌల‌భ్యం ఉంటుంది. కానీ సిమ్ భౌతికంగా ఉండ‌దు. ఆయా ఫోన్ల‌లో డ్యుయ‌ల్ సిమ్ స్లాట్లు ఉంటాయి. కాక‌పోతే ఒక్క స్లాట్‌లోనే సిమ్ వేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రొక స్లాట్‌లో ఇ-సిమ్ స‌ర్వీస్ వాడుకోవాలి. ఇ-సిమ్‌లో టెలికాం కంపెనీ మ‌నం వాడే ఆ కంపెనీకి చెందిన నంబ‌ర్‌కు గాను సెట్టింగ్స్‌ను పంపుతుంది. వాటిని ఫోన్ల‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే.. ఇ-సిమ్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో ఫోన్ల‌లో డ్యుయ‌ల్ సిమ్‌లు ప‌నిచేస్తాయి.

వొడాఫోన్ ఐడియా క‌స్ట‌మ‌ర్లు ఇ-సిమ్ సేవ‌ల‌ను పొందేందుకు ఇలా చేయాలి.

* క‌స్ట‌మ‌ర్లు eSIM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి వారి రిజిస్ట‌ర్డ్ మెయిల్ ఐడీని టైప్ చేసి 199 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. రిజిస్ట‌ర్డ్ మెయిల్ లేక‌పోతే.. email అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మెయిల్ ఐడీని టైప్ చేసి 199 నంబ‌ర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. దీంతో ఈ-మెయిల్ రిజిస్ట్రేష‌న్ అవుతుంది. అనంత‌రం ముందు తెలిపిన కోడ్‌తో ఇ-సిమ్ సేవ‌ల‌కు ఎస్ఎంఎస్‌ను పంపాలి.

* ఈ-మెయిల్ వాలిడ్ అయితే 199 నంబ‌ర్ నుంచి ఎస్ఎంఎస్ వ‌స్తుంది. దానికి ESIMY అని టైప్ చేసి రిప్ల‌యి ఇవ్వాలి. దీంతో ఇ-సిమ్ రిక్వెస్ట్ క‌న్‌ఫాం చేసుకోవ‌చ్చు.

* క‌న్ఫ‌ర్మేష‌న్ ఎస్ఎంఎస్ వ‌చ్చాక 199 నంబ‌ర్ నుంచి మ‌రొక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. ఇ-సిమ్‌కు అనుమ‌తి ఇస్తూ వ‌చ్చే కాల్‌కు అనుమ‌తి తెల‌పాల్సి ఉంటుంది. అనంత‌రం ఈ-మెయిల్‌కు ఒక క్యూఆర్ కోడ్ వ‌స్తుంది.

* ఐఫోన్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లి మొబైల్ డేటా విభాగంలోని యాడ్ డేటా ప్లాన్ ఆప్ష‌న్‌లో స‌ద‌రు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. అనంత‌రం ఫోన్‌లో ఇచ్చే స్టెప్స్‌ను ఫాలో అవ్వాలి. దీంతో వొడాఫోన్ ఐడియా ఇ-సిమ్ సేవ‌ల‌ను ఐఫోన్ల‌లో పొంద‌వ‌చ్చు.

కొత్త క‌స్ట‌మ‌ర్లు త‌మ‌కు స‌మీపంలో ఉండే వొడాఫోన్ స్టోర్‌కు వెళ్లి త‌మ ఐడీ ప్రూఫ్‌, ఫొటోల‌ను ఇవ్వాలి. దీంతో కొత్త వొడాఫోన్ ఇ-సిమ్ క‌నెక్ష‌న్ పొంద‌వ‌చ్చు. కాగా ఎయిర్‌టెల్‌, జియోలు ఇప్ప‌టికే స‌ద‌రు ఐఫోన్ల యూజ‌ర్ల‌కు ఇ-సిమ్ సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఈ జాబితాలో వొడాఫోన్ ఐడియా వ‌చ్చి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news