తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..!?

-

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైరస్ కట్టడి విషయంలో.. తెలంగాణ సర్కార్ పనితీరు హైకోర్టును ఏ మాత్రం మెప్పించలేకపోతోంది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన హైకోర్టు.. తాజాగా మరోసారి విరుచుకుపడింది.

high-court
high-court

వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను బాధ్యుల్ని చేస్తామని పేర్కొంది. ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు పరీక్షలు చేయాలన్న ఆదేశాలు అమలు కావడంలో లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్కువ కరోనా పరీక్షలు, మీడియా బులెటిన్‌లో స్పష్టత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రజల్లో కరోనా ర్యాండమ్‌ టెస్టులు చేయడంలేదని ప్రభుత్వంపై ఆసహనం వ్యక్తం చేసింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా వైరస్‌ సోకిందని తెలిపింది. మీడియా బులెటెన్‌లో తప్పడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

కేసులు పెరిగిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని, ప్రజలను గాలి వదిలేసిందని ధ్వజమెత్తింది. కరోనా బులిటెన్‌, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది. అంతేకాదు కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని హైకోర్టు అభినందించిందని మీడియా బులెటిన్‌లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం చివాట్లు పెడుతుంటే.. అభినిందించిందని ప్రజలకు తప్పుదోవ పట్టిస్తారా అని హైకోర్టు విరుచుకుపడింది.ఈ నెల 18లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news