ఉరి తీస్తే వచ్చిన డబ్బుతో కూతురి పెళ్లి చేస్తా…!

-

నిర్భయ కేసులో నిందితులను ఉరి తీసే అవకాశం రావడం తనకు దక్కిన అధ్రుష్టమని వారిని ఉరి తీయబోతున్న తలారి పవన్ జలాద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారిక తలారిగా ఉన్న పవన్ జలాద్ ని, నిర్భయ దోషులను ఉరి తీయడానికి గాను ఢిల్లీలోని తీహార్ జైలుకి రావాలని అధికారులు కోరారు. దీనితో వారిని ఉరి తీయడానికి గాను పవన్ జలాద్ సిద్దమవుతున్నారు.

దీనిపై మాట్లాడిన పవన్, ఈ నెల 22వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అన్నారు. ఆ రోజు కాకుంటే, ఆ మరుసటి రోజు అన్న ఆయన, నన్ను ఇక్కడి నుంచి తీహార్ జైలుకు తీసుకుని వెళతారన్నారు. నాకిప్పుడు డబ్బుల అవసరం ఎంతో ఉందన్న ఆయన… ఆ దోషులను నేను ఉరి తీస్తే వచ్చే డబ్బుతోనే నా కుమార్తె వివాహం జరిపించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

వారిని ఉరి తీసే అవకాశం తనకు లభించడమే దేవుడిచ్చిన వరమని, మీరట్ జైల్లో తరతరాలుగా తలారులుగా పనిచేస్తున్న కుటుంబానికి చెందిన 57 ఏళ్ల పవన్ మీడియాకు తెలిపారు. వారిని ఉరి తీస్తే ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 రూపాయల నగదు ఇవ్వనుంది. ఆయనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం నెలకు 5 వేలు మాత్రమే చెల్లిస్తుంది. దీనితో వారిని ఉరి తీస్తే, తనకు లక్ష రూపాయలు ప్రభుత్వం నుంచి వస్తుందని,

దానితో తన కుమార్తె వివాహం జరిపిస్తానని అన్నారు. ఈ అవకాశం కోసం తాను ఎన్నో నెలలుగా వేచి చూస్తున్నానని అన్నారు. తన తాత కల్లూరామ్ కు ఒక్కో ఉరికి రూ. 200 ఇచ్చారని, 1989లో ఓ దోషిని ఉరితీసేందుకు ఆగ్రా సెంట్రల్ జైలుకు తాను తాతతో కలిసి వెళ్లానని, దోషి కాళ్లను తాను కట్టగా, తన తాత తాడు లాగారని గుర్తు చేసుకున్నారు. ఇందిరాగాంధీ హత్య కేసు నిందితులు సత్వంత్ సింగ్, కేహార్ సింగ్ లను తన తండ్రి మమ్మూ జలాద్, తాత కల్లూరామ్ లు కలిసి ఉరితీశారని ఆయన చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news