మెట్రోకి రాకుండానే సరుకులు…!

-

కరోనా నేపధ్యంలో ఇప్పుడు సామాన్య ప్రజలు నిత్యావసర సరుకులకు బాగా ఇబ్బంది పడుతున్నారు. తినడానికి తిండి లేక అవస్థలు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడ సరుకుల కోసం బయటకు వస్తే కరోనా అంటే అవకాశం ఉందో అని భయం తో బయటకు వచ్చే పరిస్థితి లేదు. దీనితో నిత్యావసర సరుకుల కోసం ఇప్పుడు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ కామర్స్ సంస్థల మీదా ఆధారపడుతున్నారు.

దీనితో నిత్యావసర సరుకుల కోసం అనేక ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కామర్స్ సంస్థలు అన్నీ కూడా ఇప్పుడు నిత్యావసర సరుకుల కోసం ఆఫర్లు ఇస్తున్నాయి. ఇక మెట్రో కూడా ఇప్పుడు సరుకులకు ఆఫర్లు ఇస్తుంది. తాజాగా కీలక ప్రకటన చేసింది… మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ ఇండియా ఆఫర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ సప్లయ్‌ చైన్‌ డైరెక్టర్‌ మనీష్‌ సబ్నీస్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ….

తమ స్టోర్లన్నీ పగలు, రాత్రి శానిటైజ్‌ చేస్తున్నామన్న ఆయన… వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. ఉద్యోగులందరికీ మాస్కులు, క్యాషియర్లకు అదనంగా ఫేస్‌ షీల్డ్స్‌ అందిస్తున్నామని చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత కూడా స్టోర్లు ఉన్న ప్రాంతాల్లో కేసులు పూర్తిగా తగ్గే వరకూ శానిటైజ్‌ కొనసాగిస్తామని, తమ స్టోర్లలో తీసుకుంటున్న భద్రతా చర్యలను ఆయన వివరించారు. మెట్రో కి రాకుండానే మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ యాప్‌ ద్వారా కావాల్సిన వస్తువులను తమ దుకాణాల వద్దనే డెలివరీ పొందే అవకాశం ఇస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news