కరోనా వైరస్ లాంటి భయంకరమైన విపత్కర సమయంలో గ్రామ వాలంటీర్ల పనితనం అందరూ మెచ్చుకోవాల్సిందే. వైరస్ రాష్ట్రంలో వచ్చిన సందర్భంలో విదేశాల నుండి వచ్చిన వారి వల్ల ఎక్కువగా వ్యాప్తి చెందే సమయంలో బాగా రాణించారు. ఆ టైంలో ఎక్కడికక్కడ వారి డేటాను సేకరించడంలో గ్రామ వాలంటీర్ల పనితనం పై జాతీయ మీడియా పొగడ్తల వర్షం అప్పట్లో కురిపించింది. విదేశాల నుండి వచ్చిన వారు ఎప్పుడూ ఎలా వచ్చారు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు అన్ని వివరాలు సేకరిస్తూ ఎప్పటికప్పుడు చాలా అలర్ట్ గా పని చేయడం జరిగింది.ఇదిలా ఉండగా ప్రస్తుతం రాష్ట్రంలో వైరస్ భయంకరంగా విజృంభిస్తోంది. దీంతో వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో దీన్ని డీల్ చెయ్యడం లో భాగంగా ఏపీ గ్రామ వాలంటీర్లకు సరికొత్త అగ్నిపరీక్ష లాంటి పనులు చేయించడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. లాక్ డౌన్ తర్వాత విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చేవారిని క్వారంటైన్ చేసే బాధ్యతను గ్రామ వాలంటీర్లకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామ సచివాలయానికి ఒక యూనిట్ గా తీసుకోవాలని జగన్ ఆదేశించడం జరిగింది. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని ఆదేశిస్తున్నారు. భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష పడకలు సిద్ధం చేయాలని తెలిపారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని ఏపీ వాలంటీర్లకు సూచించారు, బస్సులో వీలైనంతవరకూ ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మరి ఇన్ని అగ్నిపరీక్ష లాంటి పనులను ఏపీ గ్రామ వాలంటీర్లు రాబోయే రోజుల్లో ఎలా నిర్వహిస్తారో చూడాలి.