కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి వద్ద ఓ మహిళ హల్‌చేల్ చేసింది. బ్రిడ్జిపైకి ఎక్కి కొంతసేపు హంగామా సృష్టించింది. తన నోబెల్ బహుమతిని ఎవరో దొంగిలించారని, వెంటనే దాన్ని తనకు తిరిగి ఇప్పించాలని, లేకపోతే బ్రిడ్జి మీద నుంచి దూకేస్తానని.. కొంతసేపు హడావిడి చేసింది. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆమెకు సర్ది చెప్పారు. దీంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు.
కోల్‌కతాలోని నార్త్ 24 పరగణాస్ జిల్లా అశోక్ నగర్‌కు చెందిన 37 ఏళ్ల డాలీ బోస్ అనబడే ఓ మహిళ ఆదివారం కోల్‌కతాలోని ప్రఖ్యాత హౌరా బ్రిడ్జి పిల్లర్లపైకి ఎక్కి హడావిడి చేసింది. తనకు చిన్న వయస్సులో వచ్చిన నోబల్ బహుమతిని ఎవరో దొంగిలించారని, తన బహుమతిని తనకు ఇప్పించాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి సర్ది చెప్పడంతో ఆమె బ్రిడ్జిపై నుంచి దిగి వచ్చి వారితో మాట్లాడింది. అనంతరం ఆమెను పోలీసులు అక్కడి నుంచి తరలించారు.
అయితే ఆమె బాగా చదువుకుంది. అయినప్పటికీ అలా ఎందుకు ప్రవర్తించిందో పోలీసులకు అర్థం కాలేదు. ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించగా వారు కూడా ఆమె మానసిక స్థితి బాగానే ఉందని చెప్పారు. అయితే ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదని పోలీసులు తెలిపారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.