తప్పుడు పనులూ మీవే.. విమర్శలూ మీవేనా తమ్ముళ్లు?

-

“బయట రాష్ట్రాలనుండి విచ్చలవిడిగా ఎన్.డి.పి లిక్కర్. మీ పార్టీ నేతల కనుసన్నల్లోనే బ్రాండ్ల మద్యం అమ్మకాలు” అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా జగన్ ను విమర్శిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలో సరైన బ్రాండ్స్ దొరకని కారణంగా… బయట రాష్ట్రాలనుంచి విచ్చలవిడిగా లిక్కర్ సరఫరా అవుతుందని, అది కూడా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందని చెప్పుకొచ్చారు. తీరా తాజాగా వెలుగులోకి వచ్చిన సంగటనను గమనిస్తే… ఇలాంటి తప్పుడు పనులు చేసున్నది టీడీపీ చోటా మోటా నెతలే అని తెలుస్తుంది!!

అనంత‌పురం జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే త‌న‌యుడు క‌ర్ణాట‌క నుంచి మ‌ద్యాన్ని దించుతూ ప‌ట్టుబ‌డగా.. తాజాగా కృష్ణా జిల్లాలో ఒక తెలుగు త‌మ్ముడు విజ‌య పాల వ్యాన్ ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి మ‌ద్యం త‌ర‌లిస్తూ దొరికాడు. ఈ తెలుగు తమ్ముడు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ కు బాగా స‌న్నిహితుడ‌ట. విజ‌య పాల ఏజెన్సీ తీసుకుని.. తిరుగు ప్రయాణంలో పాల వ్యాన్ ల ద్వారా మ‌ద్యాన్ని త‌ర‌లిస్తున్నాడు! ఈ సైడ్ బిజినెస్ కార్యక్రమం వెలుగులోకి రావడంతో ఇత‌డికి పాల ఏజెన్సీని ర‌ద్దు చేస్తున్న‌ట్టుగా విజ‌య డైరీ కూడా ప్ర‌క‌టించింది.

ఈ విధాంగా క‌ర్ణాట‌క నుంచి, తెలంగాణ నుంచి.. వీలైన మార్గాల్లో మ‌ద్యాన్ని త‌ర‌లిస్తూ తెలుగు త‌మ్ముళ్లు ప‌ట్టుబ‌డుతుంటే… దేవినేని ఉమ, మొదలైన టీడీపీ నేతలు మాత్రం… అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం ఏపీకి వస్తుంది.. అది కూడా వైకాపా నేతలే చేస్తున్నారు అంటూ రోజూ మైకులముందుకొచ్చి ఆరోపణలు చేస్తున్నారు. ఈ దెబ్బతో వారు చేస్తున్న ఆరోపణలకు విలువలేకుండ పోయినట్లే! ఇంతకాలం మద్యం అక్రమ రవాణా పేరుచెప్పి ఏపీ ప్రభుత్వంపైనా, వైసీపీ పైనా చేసినవిఅన్నీ గాలి ఆరోపణలు అని, ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని.. ఆ అక్రమ మద్యం తరలింపు కార్యక్రమం చేస్తుంది టీడీపీ నేతలే అని గ్రహించి ఇకపై అయినా.. ఇలాంటి చవకబారు ఆరోపణలు మానుకుంటారని వైకాపా నేతలు ఆశిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version