వావ్ గ్రేట్‌ : సైకిల్ పై నగ్నంగా లండన్ మొత్తం తిరిగిన అమ్మాయి.. కారణం ఏంటంటే..?

-

కెర్రీ బేరీస్.. నగ్నంగా సైకిల్ పై లండన్ చుట్టూ పది మెళ్ళు తిరిగిన అమ్మాయి. శరీరం మీద నూలుపోగు లేకుండా చలికాలంలో లండన్ మొత్తం చుట్తేసింది. మానసిక ఆరోగ్యం కోసం పాటుపడే స్వఛ్ఛంద సంస్థకి విరాళాలు సేకరించేందుకు ఈ విధమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. కెర్రీ కజిన్ మానసికంగా బాగాలేకపోవడం వలన ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుండి మానసిక సమస్యలున్న వారికోసం ఏదైనా చేయాలన్న ఉద్దేశ్యంతో చాలా ఆలోచించింది. సడెన్ గా తనతో పాటు ఇంట్లో ఉండే ఫ్రెండ్, నగ్నంగా బైక్ రైడ్ చేయమని సలహా ఇచ్చింది. తన ఫ్రెండ్ అంత సీరియస్ గా చెప్పకపోయినప్పటికీ, కెర్రీ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

అంతే, వెంటనే అమల్లో పెట్టేసింది. స్వఛ్ఛంద సంస్థ మైండ్ కోసం విరాళాలు సేకరిస్తూనే ఆత్మహత్య నివారణపై అవగాహన పెంచేందుకు ఈ విధంగా చేస్తుంది. లాక్డౌన్ కారణంగా చాలామందిలో మానసిక సమస్యలు పెరిగాయి. మానసిక సమస్యలు ఉండటం వల్ల కెర్రీ ఫ్రెండ్, లాక్డౌన్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. అదీగాక తొమ్మిది సంవత్సరాల క్రితం తన కజిన్ ఆత్మహత్య చేసుకుంది.

ఐతే మొదట్లో ఈ ఐడియాని తన కుటుంబ సభ్యులు తప్పుబట్టారు. కానీ సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చిందట. దాంతో ఇంకేమీ ఆలోచించకుండా ముందుకు వెళ్లానని తెలిపింది. లండన్ వీధుల్లో నగ్నంగా సైకిల్ పై తిరుగుతుంటే చాలామంది రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు చీర్ అప్ చేస్తూ ప్రోత్సహించేవారట. కొంతమంది కారు అద్దాలు దించి మరీ ఉత్సాహ పరిచే వారని, తనతో పాటు కొంతదూరం వాళ్ళు కూడా వచ్చేవారట.

Read more RELATED
Recommended to you

Latest news