ఒకప్పుడు ప్రేయసి గా పనికిరాదు అన్నాడు కానీ ఇప్పుడు మిస్ బ్రిటన్

-

ఒకప్పుడు ప్రేయసిగా పనికిరావు అంటూ ప్రేమించినవాడు సైతం వదిలి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు అదే మహిళ మిస్ గ్రేట్ బ్రిటన్-2020 కిరీటాన్ని దక్కించుకుంది. పట్టుదల జెన్ అట్కిన్ ను ఏ స్థాయిలోకి తీసుకొచ్చి నిలబెట్టిందో చూడాలి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు జెన్ అట్కిన్ చాలా లావుగా ఉండేది. దీనితో ప్రేమించిన వ్యక్తి సైతం ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకోలేను అని చెబుతూ ఆమె జీవితం నుంచి తప్పుకున్నాడు. దీనితో బాగా కృంగిపోయిన ఆమె కొన్ని నెలల తరువాత తేరుకుంది. తనను ఏకారణం గా వదిలి వెళ్ళిపోయాడు ఎలాగైనా అతడు జలస్ ఫీల్ అవ్వాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది. దీనితో 102 కేజీల బరువు ఉన్న తన శరీరాకృతి ని తగ్గించుకోవడానికి విపరీతమైన సాధన మొదలు పెట్టి తన శరీరాన్ని తనకు కావాల్సిన విధంగా మలుచుకుంది.

అయితే గతేడాది మ్యారేజ్ చేసుకున్న ఆమె అందాల పోటీ లకు గుడ్ బై చెప్పాలని భావించినప్పటికీ చివరి ప్రయత్నంగా అందాల పోటీల్లో పాల్గొన్నది. అయితే గత రెండు సార్ల నుంచి విఫలమౌతూ వస్తున్న ఆమె ఈసారి మాత్రం బ్రిటన్ అందాల సుందరిగా నిలిచింది. ఆమె లో పెరిగిన కసి,కృషి,పట్టుదలలే సాధారణ మహిళా గా ఉన్న 26 ఏళ్ల జెన్ అట్కిన్ ను మిస్ గ్రేట్ బ్రిటన్-2020 కిరీటాన్ని దక్కించుకొనే స్థాయికి చేర్చింది.

Read more RELATED
Recommended to you

Latest news