షాకింగ్.. పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం!

-

ఓ మహిళ ఏకంగా పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్యాయత్నం చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకున్నది. ఓ మహిళ మంగళవారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లోకి వెళ్లింది. కొంత సేపటికి బయటికి వచ్చిన ఆ మహిళ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ మూత తీసి ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నది. మహిళ ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన స్థానికులు, పోలీస్ సిబ్బంది వెంటనే ఆ మహిళకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. అనంతరం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కండీషన్ సీరియస్ గానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనను రోడ్డు మీద వెళ్తున్న ఓ వాహన దారుడు వీడియో తీసి వాట్సప్ లో షేర్ చేయగా.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news