ఈ రకం ప్రమాదాలకు ఇన్సూరెన్స్ రాదు..!

-

ఇన్సూరెన్స్ ఉంది కదా అని కొంతమంది తమ వాహనాన్ని ఇష్టమొచ్చినట్లు రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్లకు చేదువార్త. నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురైతే బీమా వర్తించదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒక వేల ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికిమాత్రం ‘పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ’ కింద పరిహారం అందుతుందని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన ధర్మాసనం తీర్పుని వెలువరించింది.

2012 మే 20న దిలీప్ భౌమిక్ అనే వ్యక్తి తన కారుని నడుపుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు బీమా కంపెనీకి  క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్పందించిన కంపెనీ స్వయం తప్పిదం, నిర్లక్ష్యం, అతివేగం  కారణంగా ప్రమాదానికి గురయ్యాడని పేర్కొంటూ బీమా చెల్లించడం సాధ్యం కాదన్నారు.. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల కేసు త్రిపుర హైకోర్టుకి కేసు చేరింది.  భౌమిక్ కుటుంబ సభ్యులకు రూ.10.57 లక్షల బీమా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో సదరు కంపెనీ సుప్రీం కోర్టుని ఆశ్రయించగా.. పిటిషన్ను పరిశీలించిన సుప్రీం కోర్టు … త్రిపుర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన బెట్టింది.

మోటారు వాహనాల చట్టంలో ని సెక్షన్ 166 ప్రకారం బాధిత కుటుంబ సభ్యులు స్వయం తప్పిదం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబ సభ్యులు బీమా కొరవద్దని సూచించింది. భౌమిక్ కుటుంబ సభ్యులకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కింద రూ. 2 లక్షలు చెల్లించాలని బీమా కంపెనీని ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news