కరోనా భయంతో ఏకంగా డబ్బును ఓవెన్ లో పెట్టింది..చివరికి బొగ్గే

-

కరోనా ప్రపంచ దేశాలను వణికించేస్తున్న విషయం తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ఖండాలు సైతం విలవిల్లాడిపోతున్నాయి కూడా. డ్రాగన్ దేశంలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. అయితే ఇది గాలి ద్వారా కాకుండా కరోనా సోకిన వారు ముట్టుకున్న వస్తువులను ముట్టుకున్నా ఈ వైరస్ సోకుతుంది అని చెబుతున్నారు. దీనితో కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ కరోనా వస్తువుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది అంటూ చెప్పడం తో కరెన్సీ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ చైనా మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. పేపర్ కరెన్సీకి బదులుగా ఆన్లైన్ చేయాలని ఆదేశాలు కూడా జారీచేసింది. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో డబ్బును కూడా అందుబాటులో ఉంచింది. అయితే బయట బ్యాంకు కు వెళ్లి డబ్బులు డ్రా చేసుకొని వచ్చిన ఆంట్ లీ అనే ఒక మహిళ రూ.31 వేలు డ్రా చేసుకొని వచ్చింది. అయితే బయట నుంచి రావడం తో డబ్బు విషయంలో ఆమెకు ఒక అనుమానం కలిగింది.

ప్రభుత్వం సూచించిన విషయాలు గుర్తుకు రావడం తో కరెన్సీ నోట్లపై కూడా కరోనా వైరస్ వస్తుంది అన్న మాత్రలు గుర్తుకు వచ్చి ఆ సందేహంతో ఆ డబ్బును ఒవేన్ లో పెట్టింది. ఆలా పెట్టిన కాసేపటికి లోపలి నుంచి వాసన రావడంతో ఒవేన్ ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా షాక్ అయ్యింది ఆ మహిళ. కరోనా సోకుతుంది అని జాగ్రత్త కోసం ఒవేన్ లోపల పెట్టిన ఆ డబ్బు కాలిపోవడం తో ఆ మహిళ కు పెద్ద షాక్ తగిలినట్లు అయ్యింది. కరోనా వైరస్ నుంచి డబ్బును కాపాడుదాం అనుకుంటే, ఏకంగా డబ్బే కాలిపోవడంతో షాక్ అవ్వడం ఆ మహిళ వంతయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version