అక్కడ అమ్మాయి నచ్చితే ఎత్తుకెళ్లి పెళ్లిచేసుకోవచ్చట..!

-

ఈరోజుల్లో వివాహం అంటే.. పెద్ద తతంగం. బ్రోకర్లు, మ్యాట్రిమోనీలు వీళ్ల హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ పూర్వకాలంలో పెళ్లంటే ఇవేవి ఉండేవికావంట. నచ్చిన అమ్మాయిలను ఎత్తుకుపోయి వివాహం చేసుకునే పద్ధతి ఉండేది. దీన్ని రాక్షస వివాహం అనేవాళ్లు. ఇక ఆ అమ్మాయికి ఇష్టంలేకపోయినా..సచ్చినట్లు కాపురం చేయాల్సిందే. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల అమలు చేసేవారు. టెక్నాలజీ మారాక..ఈ ఆచారం పోయింది. కొన్ని మూఢనమ్మకాలు రూపుమారాయి. కానీ ఇండోనేషియాలో ఈ ఆచారం ఇంకా అమలలో ఉంది.

ఇండోనేషియాలోని ‘సుంబా దీవిలో రాక్షస వివాహాలు ఇంకా జరుగుతున్నాయి. ఈ పెళ్లిళ్లు .. అమ్మాయిల ఇష్టంతో జరుగుతున్నవి కావు. అబ్బాయిలు బలవంతంగా మనువాడుతున్నవి. ఈ దురాచారం అక్కడ ‘’కవిన్‌ టాంగాప్‌’’ అనే పేరుతో జరుగుతుందట.

కొందరి ఆచారాలు, సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి. ‘సుంబా’ ప్రజల ఇతర ఆచారాలూ, నమ్మకాలూ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. వీరు ‘మరపు’ అనే ప్రాచీనమతాన్ని కూడా ఆచరిస్తారు. వాళ్లు వస్తువులకు ప్రాణం ఉందని నమ్ముతారట. నీళ్లు నుదుటిని తాకితే ఇంట్లోంచి బయటికి వెళ్లకూడదనేది వీరి విశ్వాసం. అందుకే కిడ్నాప్ అయిన అమ్మాయిని ఇంట్లోకి లాక్కెళ్లి తలకు నీళ్లు తాకిస్తారు. ఇక తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి యువకుడు అవసరమైతే తన కుటుంభీకులతో ఆ అమ్మాయి ఇంటి మీదకు దండయాత్రకు కూడా వెళ్తాడు. అమ్మాయిని కిడ్నాప్ చేసి..అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళాడు అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం. అయితే ఒకవేళ ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చకపోయినా కాపురం చేయాల్సిందే.

ఒక్కసారి కిడ్నాప్‌ తర్వాత పెళ్లి నుంచి తప్పించుకున్న అమ్మాయిలు చాలా తక్కువ. ఒకవేళ తప్పించుకున్నా ఆ అమ్మాయికి సమాజంలో గౌరవం ఉండదట ఏదో తప్పు చేసినట్లు చూస్తారట..పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి వారు తగరని వెలివేస్తారు. అవమానకరంగా చూస్తారు. పాపం ఆమె ఏం చేసిందని వాళ్లంతా ఇలాంటి ఆచారాల పేరుతో అమ్మాయిల జీవితం నాశనం చేస్తున్నారు. ఆ భయంతో అక్కడి ఆడపిల్లలు కిడ్నాప్‌ చేసినవారినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. ఇటువంటి వింత ఆచారాలను రూపుమాపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఇంకా అమలులోకి రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news