ఎల్లుండి వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత ప్రారంభం : 8.71 లక్షల మందికి లబ్ది

వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నెల 7న ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అక్క చెల్లెమ్మల సంక్షేమం, స్వావలంబన, సాధికారతే ధ్యేయంగా ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారిని చేసే దిశగా అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఎల్లుండి వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.

jagan
jagan

వైఎస్‌ఆర్‌ ఆసరా రెండో విడతలో మొత్తం 8.71 లక్షల మహిళా సంఘాలలోని 87.74 లక్షల అక్కచెల్లెమ్మలకు లబ్ది చేకూరేలా రూ. 6,792 కోట్లు నేరుగా మహిళా సంఘాల పొదుపు ఖాతాలలో అక్టోబర్‌ 7 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు జమ చేయనుంది ఏపి సర్కార్.

పథకం ఉద్దేశం : ఈ పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ది చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకం తీసుకు వచ్చారు.