MAA ELECTIONS : ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు వార్నింగ్.. ఒళ్లు దగ్గర పెట్టుకో !

-

ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. ఉమ్మడి కుటుంబం లో కొన్ని సమస్యలు వుంటాయి వాటిని రోడ్డు మీదకు తీసుకు రావద్దని.. తన గురించి మాట్లాడండి కానీ తన ఫ్యామిలీ గురించి మాట్లాడ వద్దని హెచ్చరించారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ప్రకాష్ రాజ్ కు విష్ణు వార్నింగ్ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ కు ఎవరైనా బిపి మాత్ర ఇస్తే బాగుంటుందని.. అపరిచితుడు గా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు.

చిన్న చిన్న విషయాల కు “మా” పరువు తీస్తున్నాడని.. రియల్ లైఫ్ లో కూడా యాక్ట్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వద్దని ఎలక్షన్ కమిషన్ కి చెప్పమని.. మా ప్యానెల్ సభ్యులు కూడా పేపర్ బ్యాలెట్ కి వెళదాము అని చెప్పారని గుర్తు చేశారు. ప్రకాష్ రాజ్ విషయం తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడతాడని ఫైర్ అయ్యారు.

పెద్దలకు గౌరవం ఇవ్వలేని వాడు ఏమి చేస్తాడు.. కృష్ణ, కృష్ణంరాజు నీ ప్రకాశ్ రాజ్ అవమానిస్తారా??? అని నిలదీశారు. తమిళ్ కన్నడ మలయాళ ఇండస్ట్రీ లో ప్రకాష్ రాజ్ గురించి ఎవరినడిగినా చెపుతారని చురకలు అంటించారు. ప్రకాశ్ రాజ్ మాట్లాడేది చాలా తప్పు అని.. ఓటు అడిగే హక్కు తన కుందన్నాడు. ఇక్కడ “మా” ఇల్లు ను పాడు చేసేందుకు ప్రకాష్ రాజ్ కంకణం కట్టుకున్నాడని మండిపడ్డారు. “నాకు నా తండ్రి సపోర్ట్ వుంది..నేనే గెలుస్తా” అంటూ మంచు విష్ణు ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news