పక్కలోకి రాకుంటే.. నీ నగ్న వీడియోలు బయట పెడతా..

-

రవళి అనే మహిళ (పేరు మార్చాం) ఓ సెక్యూరిటీ కంపెనీలో పని చేస్తోంది. రవిళికి అక్కడ తోటి మహిళలతో స్నేహం ఏర్పడింది. ఈనేపథ్యంలో ఆ కంపెనీలో పనిచేసే మహిళ రవళిని ఓ హోటల్‌కు రావాలని పిలిచింది. అయితే తనకు తెలిసిన మహిళే కదా అని హోటల్‌కు వెళ్లిన రవళిని.. గదిలోకి తీసుకువెళ్లింది ఆ మహిళ. రవళిని మాటల్లోపెట్టి.. మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ను రవళితో తాగించింది. ఆ కూల్‌ డ్రింక్‌ తాగిన రవళి నిద్రమత్తులోకి జారుకుంది. దీంతో.. స్పృహ లేకుండా పడి ఉన్న రవళిపై ఆరుగురు వ్యక్తులు తమ కామవాంఛ తీర్చుకున్నారు. దీంతో పాటు రవళి ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్న వీడియోలు చిత్రీకరించారు.

స్పృహా వచ్చిన రవళికి తనపై అత్యాచారం జరిగిందని అర్థమైంది. అయితే.. జరిగింది ఎవరికైనా చెబుతే.. నీ నగ్న వీడియోలు బయటపెడతామని బెదిరించారు. అంతేకాకుండా.. ఈ నగ్న వీడియోలను అడ్డుపెట్టుకొని.. తమతో సెక్స్ చేయకుంటే.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించి.. పలుమార్లు రవళిపై అత్యాచారానికి ఒడిగట్టారు. దాదాపు రెండేళ్ల పాటు రవళిపై అత్యాచారం చేశారు. వారి బెదిరింపులు తాళలేక రవళి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళతో పాటు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version