వరంగల్ బస్ డిపోలో మహిళ డెడ్ బాడీ కలకలం..!

హనుమకొండ బస్ డిపో లో డెడ్ బాడీ కలకలం రేపింది. బస్ డిపో లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. డిపోలో ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం చేసుకుంది. అదే డిపో లో పనిచేస్తున్న ఉద్యోగులు వేలాడుతున్న మహిళ మృతదేహాన్ని గుర్తించి వెంటనే డిపో మేనేజర్ కు సమాచారం అందించారు. చనిపోయిన మహిళ వయసు 40 ఏళ్లుగా గుర్తించారు. దాంతో వెంటనే డిపో మేనేజర్ విజయ్ పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్ లోని మహాత్మా గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ మహిళ డిపోలో ఉద్యోగిని కాకపోయినప్పటికీ అసలు ఆ ప్రదేశానికి ఎందుకు వచ్చింది… అక్కడ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా హత్యా లేదంటే ఆత్మహత్య అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. దాంతో ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.