మరో కీచకపర్వం.. మత్తుమందు ఇచ్చి.. నగ్నంగా గ్యాంగ్‌ రేప్‌

-

స్రీలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై కామవాంఛ తీర్చుకుంటున్నారు. పని చేసే చోట తోటి సహోద్యోగినిపై మరింతగా రెచ్చిపోతున్నారు కామాంధులు. అలాంటి ఘటనే ఇది సహోద్యుగులు పిలిచారని హోటల్‌లో పార్టీకి వెళితే.. మత్తు మందు కలిపిన డ్రింక్‌ ఇచ్చి.. నిద్రమత్తులోకి వెళ్లాక.. నగ్నంగా వివస్త్రను చేసి ప్రైవేటు భాగాలపై కొరుకుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌హిళ స‌హా ముగ్గురు నిందితుల‌ను పోలీల‌సులు అరెస్ట్ చేశారు.

ప‌శ్చిమ బెంగాల్‌లోని విధాన్‌న‌గ‌ర్ ప్రాంతంలోని గెస్ట్‌హౌస్‌లో గ‌తవారం ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని బీపీఓ ఎగ్జిక్యూటివ్ (30)గా ప‌నిచేసే బాధితురాలు పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. త‌న సీనియ‌ర్ స‌హ‌చ‌రులు ఇద్ద‌రు పార్టీ పేరుతో గెస్ట్‌హౌస్‌కు పిలిచి మ‌త్తుమందు క‌లిపిన డ్రింక్ ఇచ్చి త‌నపై ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డార‌ని బాధితురాలు ఆరోపించింది. ఘ‌ట‌న స‌మ‌యంలో మ‌హిళా కొలీగ్ కూడా ఉంద‌ని ఆమె పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. జూన్ 15న బ‌గియాటి పోలీస్ స్టేష‌న్‌లో బాధితురాలు లిఖిత‌పూర్వ‌క ఫిర్యాదు చేయ‌గా కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేపట్టామ‌ని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితుల‌ను భాస్క‌ర్ బెన‌ర్జీ, చ‌ర‌ణ్‌జిబ్ సూత్ర‌ధార్‌, ఇంద్రాణి దాస్‌గా గుర్తించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version