ప్రయాణికుల భద్రత కోసం మహిళా శక్తి టీంలు

-

రైల్వేలో ప్రయాణించే మహిళలు, చిన్న పిల్లల భద్రత కోసం రెండు మహిళా శక్తి టీంలను ఏర్పాటు చేశామన్నారు ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ డేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ప్రయాణికుల భద్రత కోసం మహిళా శక్తి టీంలను ఏర్పాటు చేసినట్లు డేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు. సికింద్రాబాద్ టీంకు రుద్రమ్మ, కాజీపేట టీంకు నాగమ్మ అని పేర్లు పెట్టినట్లు డేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు. ఒక్కో టీంలో మొత్తం 8 మంది విమెన్ ఆఫీసర్లు ఉంటారని డేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ స్పష్టం చేశారు.

మహిళా శక్తిని చాటిన రాణి రుద్రమ దేవి, మాజీ మంత్రి నాగమ్మ పేర్లను మహిళా శక్తి టీంలకు పెట్టడం గర్వంగా ఉందన్నారు డేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ. ప్రయాణికులు భద్రతే తమ లక్ష్యమన్న కమిషనర్.. మహిళా ప్రయాణికులకు ఏవైనా భద్రతా సమస్యలు తలెత్తితే వాట్సాప్ లో సమాచారం అందిస్తే… మహిళా శక్తి టీంలు వెంటనే స్పందిస్తాయని చెప్పారు. ఒకవేళ మహిళా టీంలు అందుబాటులో లేకుంటే మిగతా ఆర్పీఎఫ్ సిబ్బంది స్పందిస్తారని డేబాస్మిత ఛటోపాధ్యాయ బెనర్జీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version