నా చావుకు ఆ న‌లుగురు కార‌ణమంటూ మ‌హిళ సూసైడ్..!

త‌న చావుకు కోడ‌లి కుంటుంబంలోని న‌లుగురు కార‌ణమంటూ ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావారి జిల్లా ఆకివీడు మాదివాడ‌లో చోటు చేసుకుంది. మాదివాడ‌లో నివాసం ఉంటున్న నాగ‌మ‌ణి అనే మ‌హిళ‌ త‌న చావుకు కోడ‌లి కుంటుంబ సభ్యులు కార‌ణం అంటూ ఫోన్ లో వీడియో రికార్డు చేసింది.

వీడియోలో కోడ‌లి కుటుంబ స‌భ్యులు త‌న‌ను వేధింపుల‌కు గురి చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అనంత‌రం భ‌వ‌నం పై నుండి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. బిల్డింగ్ పై నుండి ప‌డి మ‌హిళ మృతి చెంద‌డంతో అనుమానాస్ప‌ద మృతిగా పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.