వరల్డ్ కప్ కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. మహిళలు క్రికెట్ చరిత్రను తిరగరాసే సమయం రానే వచ్చింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ప్రైజ్ మనీని రూ. 122 కోట్లకు పెంచుతూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో జరిగిన టోర్నీకి కేటాయింపులతో పోలిస్తే ఇది 297 శాతం అధికం. టోర్నీ విజేతకు రూ. 39 కోట్లు, రన్నరప్ కు 19 కోట్లు ఇవ్వబోతున్నారు.

సెమీ ఫైనల్ లో ఓడిన జట్లకు రూ. 9 కోట్లు, గ్రూప్ దశలో పాల్గొన్న ప్రతి జట్టుకు రూ. 2 కోట్లు అందజేయనుంది. కాగా ఈ ప్రపంచ కప్ ఎడిషన్ సెప్టెంబర్ 30 నుండి భారతదేశం, శ్రీలంకలో జరుగుతుంది. భారతదేశం, శ్రీలంక కాంబోలో జరిగే ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ కు నెల రోజుల కన్నా తక్కువ సమయం మాత్రమే ఉన్నప్పటికీ, టిక్కెట్లు ఇంకా అమ్మకానికి రాలేదు. అయితే, ఈ వారం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అమ్మకానికి వస్తాయని ICC తెలిపింది.