ఏప్రిల్ 15..ప్రపంచ కళా దినోత్సవం.. ఈ రోజునే ఎందుకు జరుపుకుంటారంటే,

-

కల.. నిద్దర్లో వచ్చేది. కళ.. నిద్దర లేపేది. కృష్ణం వందే జగద్గురుం సినిమాలో కోట శ్రీనివాసరావు గారు పలికిన మాటలు ఈ కళా దినోత్సవం రోజున గుర్తు చేసుకోవాల్సిందే. నిజానికి కళ లేకపోతే జీవితంలో ఏదో వెలితిగా ఉంటుంది. మూగబోయిన గొంతు నుండి వచ్చే మాట పాటగా మారాలంటే కళ కావాలి. జీవితం కొత్తగా అనిపించే కొంత కళాపోషణ ఖచ్చితంగా ఉండాల్సిందే. కళ గురించి ఇంకా చెప్పుకునే ముందు అందరికీ ప్రపంచ కళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, దీని వెనక ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

2012 నుండి కళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యునెస్కో భాగస్వామి అయిన అంతర్జాతీయ కళా సమితి వారు ఏప్రిల్ 15వ తేదీని ప్రపంచ కళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ప్రత్యేకించి ఏప్రిల్ 15వ తేదీనే ఎందుకంటే, ఆ రోజు ప్రపంచం మెచ్చిన కళాకారుడు లియోనార్డో డావిన్సీ జన్మదినం కాబట్టి. మోనాలీసా వంటి పెయింటింగ్ వేసి ప్రపంచ కళాకారుల్లో చెరగని పేరుని లిఖించుకున్న లియోనార్డో డావిన్సీ గౌరవార్థం ఈ తేదీని ఎంచుకున్నారు.

ఫ్రాన్స్, స్లోవేకియా, స్వీడన్, సౌత్ ఆఫ్రికా, వెనిజులా మొదలగు దేశాల్లో ఈ రోజున ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తారు. కళను అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో పాఠశాలల్లో, కాలేజీల్లో కళకి సంబంధించిన సంబరాలు జరుపుతారు. ఐతే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఇలాంటి సమయంలో కళాకారులందరూ సాంకేతికత ఆధారంగా తమ కళని అందరికీ చేరవేయాలని యునెస్కో సూచించింది. కళా దినోత్సవం రోజున ప్రపంచంలోని కళకారులందరికీ శుభాకాంక్షలు..

 

Read more RELATED
Recommended to you

Latest news