షర్మిలకు కేసీఆర్ సపోర్ట్ ఉందా…?

-

2014 తర్వాత తెలంగాణలో ప్రతిపక్షాలు ఏ కార్యక్రమం చేయాలని భావించినా సరే సీఎం కేసీఆర్ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉండేది అనే సంగతి అందరికీ తెలిసిందే. చాలామంది నాయకులు కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినా సరే కొన్ని కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం పోలీసుల నుంచి అనుమతి లేకపోవడంతో వెనక్కి తగ్గిన పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం తెలంగాణలో పార్టీ పెడుతున్న వైయస్ షర్మిల విషయంలో అటువంటి వాతావరణం కనపడటం లేదు.

ఏ కార్యక్రమం చేయాలని భావించిన సరే సీఎం కేసీఆర్ నుంచి పరోక్షంగా సహాయ సహకారాలు ఉన్నాయని పోలీసులు వెంటనే అనుమతి ఇస్తున్నారని అంటున్నారు. ఖమ్మం లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో షర్మిల సీఎం కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అయినా సరే ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది.

దీనితో అసలు తెలంగాణలో టిఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. భవిష్యత్తులో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని భావించిన సీఎం కేసీఆర్ షర్మిల విషయంలో మాత్రం సానుకూలంగా ఉన్నారని కాబట్టి దూకుడుగా ముందుకు వెళుతున్నారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. త్వరలోనే షర్మిల పార్టీలోకి టీఆర్ఎస్ నేతలు కూడా వెళ్లే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news