ఏ శుభకార్యమైనా చాక్లెట్ లేకుండా పూర్తికాదనడంలో సందేహమే లేదు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చాక్లెట్లు ఇష్టపడని వారుండరు. చాక్లెట్ చాలా రకరకాలుగా అందుబాటులో ఉంటుంది. చాక్లెట్ కేక్, చాక్లెట్ ఐస్ క్రీమ్, కుకీస్, పాన్ కేక్ మొదలగునవి. ఎండలు మండిపోతున్న సమయంలో అత్యంత చల్లనైన చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటే ఆ అనందమే వేరు. అలాగే చలి చంపేస్తున్న సమయంలో వార్మ్ చాక్లెట్ అద్భుత ఆహ్లాదాన్ని అందిస్తుంది. చాక్లెట్లని ప్రతీ ఒక్కరూ ఇష్టపడతారు కాబట్టి, ప్రతీ ఏడాది జులై 7వ తేదీన ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రస్తుతం ఈ చాక్లెట్ డే రోజున అదిరిపోయే డార్క్ చాక్లెట్ రెసిపీ తెలుసుకుందాం.
కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, మీకు కావాల్సిన వాళ్ళకి ఈ చాక్లెట్ తయారు చేసి అందివ్వండి. మరి ఇంకెందుకు ఆలస్యం..
డార్క్ చాక్లెట్ ఓట్స్ మౌసీ
తయారీకి కావాల్సిన పదార్థాలు
1 1/2టేబుల్ స్పూన్ ఓట్స్
1టేబుల్ స్పూన్ కోకో పౌడర్
పావు కప్పు పాలు
1 1/2టేబుల్ స్పూన్ తేనె
1 టేబుల్ స్పూన్ చియా విత్తనాలు (ఐఛ్ఛికం)
బెర్రీ ( ఇష్టం ఉంటే వేయవచ్చు లేదంటే లేదు)
4-5 తురిమిన బాదం
తయారీ పద్దతి
ముందుగా కోకో పౌడర్, ఓట్స్ ని ఒక పాత్రలో ఉంచుకుని కలపాలి. ఆ తర్వాత ఆ పాత్రలోకి పాలు, తేనె పోసుకుని పొయ్యి మీద మరిగించాలి. అలాంటి టైమ్ లోనే చియా విత్తనాలను కలుపుకోవచ్చు. తురిమిన బాదం పలుకులను అలంకరణ కోసం మిశ్రమం పైన చేయాలి. ఒక రాత్రంతా రిఫ్రిజిరేటర్ లో ఉంచిన తర్వాత తెల్లారి సర్వ్ చేయాలి. ఇప్పుడు మీరనుకున్న డార్క్ చాక్లెట్ ఓట్స్ మౌసీ తయారయ్యింది. ఈ ప్రపంచ చాక్లెట్ డే రోజున మీకోసం ఈ రెసిపీని ప్రయత్నించండి.