లిచీతో అందాన్ని రెట్టింపు చేసుకోండి..!

-

అందమైన చర్మాన్ని పొందడానికి లిచీ బాగా ఉపయోగపడుతుంది. అదే విధంగా చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తుంది. అయితే ఈ రోజు లిచీ చర్మానికి ఎలా పని చేస్తుంది అనేది తెలుసుకుందాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

లిచీ /litchi

చాలా మంది లిచీ పండ్లని తినడానికి ఇష్టపడతారు. దీని వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఎంతో ప్రయోజనకరం.

చర్మానికి లిచీ ఎలా పని చేస్తుంది..?

స్కిన్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం వయసు పెరిగే కొద్దీ చర్మం పై ముడతలు వస్తాయి. అటువంటి సమయంలో లిచీ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ముడుతలు పడకుండా ఉంటుంది. అలాగే చర్మానికి గ్లో ని ఇది ఇస్తుంది.

లిచీ లోయాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ చర్మాన్ని డ్యామేజ్ చేయకుండా ఇది చూస్తుంది.

లిచీ తో ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేసుకోండి..?

దీని కోసం మీరు 4 నుండి 5 లిచీ పండ్లు తీసుకుని పండిపోయిన అరటిపండు ముక్కలు కొద్దిగా తీసుకుని ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖం మీద అప్లై చేసుకోండి. కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత ముఖాన్ని కడిగేసుకోండి. వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ ప్రాసెస్ లో మీరు చేయవచ్చు.

లిచీ ఫేస్ ప్యాక్ వల్ల కలిగే లాభాలు:

ముడతలు పడకుండా చర్మం అందంగా ఉంటుంది.
అదేవిధంగా గ్లో పెరుగుతుంది.
సూర్యకిరణాల నుండి చర్మం డామేజ్ కి గురవకుండా ఉపయోగపడుతుంది.
చర్మాన్ని టైట్ గా కూడా ఇది ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version