కాసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో రెండు అత్యుత్తమ జట్లు ఆడిన మ్యాచ్ లో చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగగా చివరికి ఆస్ట్రేలియాను విజయం వరించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ముందు చాలా కఠినమైన (389) లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా టీం లో హెడ్ సెంచరీ తో అలరించాడు. ఈ స్కోర్ సాధించడం ఎంతటి జట్టుకైనా చాలా కష్టం, కానీ న్యూజిలాండ్ ఆస్ధ్యాన్ని సుసాధ్యం చేసేలా కనిపించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడానికి కివీస్ సర్వశక్తులు ఒడ్డింది.. కానీ ఆస్ట్రేలియా ప్రదర్శన ముందు తమ ఆటలు సాగలేదు. చివరికి అయిదు పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది కమిన్స్ సేన. ఒకదశలో రవీంద్ర 116, మిచెల్ 54 లు టీం ను గెలిపించే ప్రయత్నం చేశారు.. కానీ కీలక సమయంలో అవుట్ అవడంతో భారమంతా నీషం మీద పడింది. ఆఖరికి చివరి ఓవర్ లో పరుగులు అవసరం అయిన దశలో స్టార్క్ రెండవ బంతిని వైడ్ ఫోర్ గా వేశాడు.. అప్పుడు అయిదు బంతుల్లో 13 పరుగులు అవసరం అయ్యాయి.
కానీ నీషం (58) ఒక్క ఫోర్ లేదా సిక్స్ కొట్టలేక మ్యాచ్ ను ఓడించాడు.. వరుసగా డబుల్స్ తీసినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా 3, హాజిల్ వుడ్ మరియు కమిన్స్ లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.