కాసేపటి క్రితమే బెంగుళూరు వేదికగా జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దాదాపుగా ఇంగ్లాండ్ ఈ వరల్డ్ కప్ లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటూ… మంచి టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. అదే విధంగా ఈ సారి కూడా శ్రీలంక ముందు కఠినమైన టార్గెట్ ను ఉంచడానికి టాస్ గెలిచిన బట్లర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బట్లర్ సేన చాలా కట్టుదిట్టమైన ప్రణాళికతో బరిలోకి దిగుతున్నారు. ఇక టీం లోనూ ఇంగ్లాండ్ కీలకమైన మార్పులు చేసింది, గత మ్యాచ్ లో ఆడిన బ్రూక్ మరియు అట్కిన్ సన్ లను తొలగించి వారి స్థానంలో లివింగ్ స్టన్ మరియు క్రిస్ వోక్స్ లను జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్ లో ఎవరు ఓడినా? సెమీస్ నుండి అవుట్ అయినట్లే లెక్క.
కాబట్టి చాలా పరువుతో కూడుకున్న మ్యాచ్ కావడం వలన అందరి కళ్ళు డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మీదనే ఉన్నాయి. ఇప్పటి వరకు బట్లర్, బెయిర్ స్టో లు తమదైన ఆటతీరు కనబరచడంతో ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్ లో అయినా చెలరేగి విజయాన్ని అందిస్తారా చూడాలి.