రోహిత్ మాస్టర్ ప్లాన్: రేపు ఆస్ట్రేలియాతో ముగ్గురు స్పిన్నర్లతో ఇండియా అటాక్ !

-

రేపు వరల్డ్ కప్ లో జరగనున్న మ్యాచ్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్లు పోటీ పడనున్నాయి. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఇండియా మీదనే ఉంది. ఇక మ్యాచ్ లో ఏ విధమైన వ్యూహాలను టీం అమలు చేయనుంది అన్న విషయంపై ఇండియా కెప్టెన్ రోహిత్ ను మీడియా ప్రశ్నించగా… రేపు పిచ్ పరిస్థితులను బట్టి మాత్రమే జట్టు ఎంపిక ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా రోహిత్ మరో హింట్ కూడా ఇవ్వడం జరిగింది, దాదాపుగా రేపటి మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందంటూ కెప్టెన్ చెప్పడమా విశేషం. ఇంకా హార్దిక్ గురించి కూడా రోహిత్ మాట్లాడారు… రోహిత్ కేవలం బౌలర్ మాత్రమే కాదు. మంచి ఆల్ రౌండర్ అంటూ కితాబిచ్చాడు.

అందుకే రేపటి మ్యాచ్ లో బలమైన ఆస్ట్రేలియా తో పోటీ పడడానికి ముగ్గురు స్పిన్నర్లు మరియు ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగుతామని క్లారిటీ ఇచ్చాడు రోహిత్ శర్మ. మరి రేపటి మ్యాచ్ లో రోహిత్ సేన ఏ విధంగా ఆడుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version