క్రికెట్ అభిమానులను ఎంతగానో ఊరిస్తున్న వరల్డ్ కప్ 2023 కు మరెన్నో రోజులు లేదు. ఐసీసీ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5 నుండి నవంబర్ 23 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో భాగంగా అక్టోబర్ 5వ తేదీన మొదటి మ్యాచ్ తో వరల్డ్ కప్ స్టార్ట్ కానుంది. ఐసీసీ మరియు బీసీసీఐ చర్చల అనంతరం ఈ రోజు కొత్త షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ఈ షెడ్యూల్ లో మొత్తం 8 మ్యాచ్ ల తేదీలు ముందుకు లేదా వెనక్కు మార్చబడ్డాయి. ఇక ఈ వరల్డ్ ఇండియాలోని మొత్తం పది వేదికలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ప్రేక్షకులు ఈ మ్యాచ్ లను చూడడానికి అనువుగా అన్ని ఏర్పాట్లను బీసీసీఐ సిద్ధం చేస్తోంది.. కాగా ఈసారి స్టేడియం లలో వాటర్ ను ఉచితంగా అందిస్తామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.
ఈ మ్యాచ్ ల టికెట్ లను కొనుగోలు చేయడానికి సంబంధించి ఒక అప్డేట్ ను ఐసీసీ ఇచ్చింది, ఆగష్టు 25వ తేదీ నుండి ఆన్లైన్ లో ప్రపంచ కప్ టికెట్ లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.