వరల్డ్ కప్ 2023: పసికూనపై చెమటోడుస్తున్న పాకిస్తాన్ !

-

ఈ రోజు హైదరాబాద్ వేదికగా వరల్డ్ కప్ లో రెండవ మ్యాచ్ జరుగుతోంది. పాకిస్తాన్ మరియయు నెథర్లాండ్ జట్లు హోరాహోరీగా మొదటి మ్యాచ్ లో విజయాన్ని సాధించడం కోసం పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన నెథర్లాండ్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ఛేజింగ్ చేయడానికి మొగ్గు చూపింది. తద్వారా మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కు ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ఫఖార్ జమాన్ (12), ఇమామ్ ఉల్ హాక్ (15), బాబర్ అజాం (5), ఇఫ్తికార్ అహ్మద్ (9) లు విఫలం అయ్యారు.. ఒకవేళ కీపర్ రిజ్వాన్ (68) మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్సమన్ షకీల్ (68) లు నాలుగవ వికెట్ కు చాలా కీలకమైన పరుగులను జోడించకపోయి ఉంటే పాకిస్తాన్ చాలా కష్టాల్లో ఉండేది. కానీ వీరిద్దరూ జట్టు భారాన్ని అంతా పైన వేసుకుని జట్టును సేఫ్ స్థాయికి చేర్చారు. ప్రస్తుతం పాకిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.

కనీసం పరుగులు చేయకపోతే నెథర్లాండ్ ను అడ్డుకోవడం కష్టమే. పసికూనపై పరుగులు చేయడానికి పాకిస్తాన్ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news