ఖమ్మంపై కేటీఆర్ గురి..ఆ ఛాన్స్ ఉందా?

-

తెలంగాణలో అన్నీ ఉమ్మడి జిల్లాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి బలం బాగానే ఉంది..కానీ ఒక్క ఖమ్మం జిల్లాలోనే డౌటే. వేరే పార్టీల నుంచి ఎమ్మెల్యేలని తీసుకున్నా సరే ఖమ్మంలో కారు పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు. పైగా మొన్నటివరకు బి‌ఆర్‌ఎస్ లో ఉన్న కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. దీంతో సీన్ మరింత మారిపోయింది. గత ఎన్నికల్లో బడా నేతలు ఉన్నా సరే ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ గెలిచింది ఒక్క సీటు మాత్రమే.

ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి నలుగురు, టి‌డి‌పి నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని బి‌ఆర్‌ఎస్ లాక్కుంది. అయితే సంఖ్యాపరంగా బి‌ఆర్‌ఎస్ బలం పెరిగింది..కానీ క్షేత్ర స్థాయిలో ఆ బలం మాత్రం పెరిగినట్లు లేదు. ఇక జిల్లాలో 10 సీట్లకు అభ్యర్ధులని ప్రకటించేశారు. దానికి ముందే బి‌ఆర్‌ఎస్ పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇటీవల తుమ్మల నాగేశ్వరరావు లాంటి నాయకుడు కాంగ్రెస్ లోకి వచ్చారు. దీంతో సీన్ మారిపోయింది.

మళ్ళీ ఖమ్మంలో కాంగ్రెస్ హవా ఉంటుందనే విధంగా రాజకీయం కొనసాగుతుంది. ఇలాంటి పరిస్తితుల్లో కే‌టి‌ఆర్ ఖమ్మంపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఖమ్మం పర్యటన పెట్టుకున్నారు. ఖమ్మం, సత్తుపల్లి సభల్లో పాల్గొంటారు. దీని ద్వారా జిల్లాలో బి‌ఆర్‌ఎస్ బలం పెంచాలని చూస్తున్నారు. అలాగే కొన్ని చేరికలు ఉండేలా బి‌ఆర్‌ఎస్ నేతలు చూస్తున్నారు.

కానీ ఎన్ని చేసిన ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్ హవా అనేది కాస్త కష్టమైన విషయం. పోనీ కమ్యూనిస్టుల అండ ఉంటే బి‌ఆర్‌ఎస్ బలపడేది. కానీ కమ్యూనిస్టులని వదిలేసింది. ఇప్పుడు వారు కాంగ్రెస్‌కు దగ్గర అవ్వాలని చూస్తున్నారు. అదే జరిగితే ఖమ్మంలో బి‌ఆర్‌ఎస్‌కు మళ్ళీ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version