వరల్డ్ కప్ లో భాగంగా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ జట్లు పోటీ పడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ పొరపాటుగా బ్యాటింగ్ తీసుకుని 204 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. దెబ్బతిన్న పులిలా పాకిస్తాన్ బౌలర్లు బంగ్లా పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా షహీన్ షా ఆఫ్రిది చెలరేగి మూడు వికెట్లు తీసుకున్నాడు.. ఇతనికి మహమ్మద్ వసీం (3) మరియు హరీష్ రాఫ్ (2) ల నుండి చక్కని సహకారం లభించింది. ఇక బంగ్లా ప్లేయర్స్ లో ఓపెనర్ లిటన్ దాస్ (45), మహ్మదుల్లా (56), షకిబుల్ హాసన్ (43) లు రాణించారు. ఇక ఎప్పటిలాగే శాంటో, రహీం, తౌహీద్ హృదయ్ లు ఫెయిల్ అయ్యారు. ఎన్ని అవకాశాలు వచ్చినా వీరు ప్రూవ్ చేసుకోవడంలో దారుణంగా ఫెయిల్ అవుతున్నారు.
కాగా ఇప్పటికే పాకిస్తాన్ కు సెమీస్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారిన నేపథ్యంలో గట్టిగా ప్రయత్నిస్తే ఇతర జట్ల ఫలితాలు కలిసి వస్తే సెమీస్ చేరవచ్చేమో అంటూ క్రికెట్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక రన్ రేట్ మెరుగుపడాలంటే ఈ స్కోర్ ను కనీసం 30 ఓవర్లలో చేధించాలి.