ఈ రోజు వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ లు తలపడనున్నాయి, పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ నాలుగు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లలో విజయాన్ని సాధించి అయిదవ స్థానంలో నిలిచింది. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒకటి మాత్రమే గెలిచి రెండు పాయింట్ లతో ఆఖరి స్థానానికి పడిపోయింది. ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తేనే ముందు ముందు సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుని అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆఫ్గనిస్తాన్ చేతిలో ఏదైనా సంచలనం జరిగి ఓడిపోతే ఇక సెమీస్ గురించి పాక్ మరిచిపోవలసిందే. ఎందుకంటే ఇప్పటికే ఇండియా, న్యూజీలాండ్ మరియు సౌత్ ఆఫ్రికాలు రేస్ లో ఉన్నారు. దాదాపుగా వీరు సెమీస్ చేరడం ఖాయమని తెలుస్తోంది. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం ఆస్ట్రేలియా , పాకిస్తాన్ ల మధ్యన భీకర పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇంగ్లాండ్ ఇక కోలుకుని మిగిలిన అయిదు మ్యాచ్ లలో అయిదు గెలిచి సెమీస్ రేస్ లో నిలవడం దాదాపు అసాధ్యమే అని చెప్పాలి. మరి ఈ రోజు మ్యాచ్ లో ఏమి జరుగుతుందో చూడాలి.