ఈ రోజు ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ల మధ్యన జరుగుతున్న మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతోంది. ముందుగా ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో న్యూజేయాలను ఆటగాళ్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఓఎపెనెర్లు కాన్ వే మరియు యంగ్ లు ఎంతో కొంత ఆరంభాన్ని అందించినా, ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. ఆ తర్వాత మిచెల్ మరియు రవీంద్ర లు కివీస్ ను ఇన్నింగ్స్ ను సమర్థవంతంగా నడిపించారు. వీరిద్దరూ కలిసి మూడవ వికెట్ కు 96 పరుగులు జోడించాక మిచెల్ (54) అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ లాతమ్ సైతం రవీంద్రకు సహకారం అందిచడంలో ఫెయిల్ అయ్యాడు. రవీంద్ర క్రీజులో ఉన్నంతసేపు ఆస్ట్రేలియాకు వణుకు పుట్టించాడు.
మొట్టమొదటి సారి వరల్డ్ కప్ ఆడుతున్న రవీంద్ర లో ఎటువంటి భయం లేకుండా సీనియర్ క్రికెటర్ లాగా ఆడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ దశలోనే రవీంద్ర (116) వరల్డ్ కప్ లో రెండవ సెంచరీ సాధించాడు.. చివరికి కమిన్స్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు.