గత వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా నిలిచిన ఇంగ్లాండ్ ఈ సారి మాత్రం అట్టర్ ప్లాప్ గా ప్రదర్శన చేస్తోంది. కెప్టెన్ బట్లర్ తో సహా సీనియర్ ఆటగాళ్లు అంతా క్రీజులో నిలబడి పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ అయిదు గేమ్స్ ఆడో ఒకటి మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఆఖరికి ఇంగ్లాండ్ ఆఫ్గనిస్తాన్ మరియు శ్రీలంక ల మీద కూడా ఓడిపోయే స్థితికి చేరుకుంది. దీనితో మాజీలు, అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. అయితే కొందరు ఇంగ్లాండ్ ఇంతలా విఫలం అవడానికి కారణం జాసన్ రాయ్ ను వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయకపోవడమే అంటున్నారు. గత వరల్డ్ కప్ గెలుచుకోవడానికి చాలా కీలకంగా మారిన జాసన్ రాయ్ ను చిన్న చిన్న కారణాలు చెప్పి అతనికి బదులుగా యంగ్ ప్లేయర్ హరీ బ్రూక్ ను తీసుకున్నారు.
కానీ అతను కూడా రాణించలేక ఫెయిల్ అయ్యాడు… ఓపెనర్ గా విరుచుకుపడే జాసన్ రాయ్ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.