వరల్డ్ కప్ 2023 మెయిన్ మ్యాచ్ లకు ముందుగా ప్రతి ఒక్క టీం కూడా రెండు వార్మ్ అప్ మ్యాచ్ లను ఆడిన సంగతి తెలిసిందే. ఈ ప్రాక్టీస్ కొన్ని జట్లకు చాలా బాగా ఉపయోగపడగా, మరికొన్ని జట్లకు తమలోని బలహీనతలు బయటపడ్డాయి. ఇక శ్రీలంక జట్టు ఆడిన రెండు వార్మ్ అప్ మ్యాచ్ లలోనూ పరాజయాన్ని ఎదుర్కొని మెయిన్ మ్యాచ్ లకు ఎన్నో ప్రశ్నలతో వెళ్లనుంది. ముందుగా శ్రీలంక బంగ్లాదేశ్ తో తలపడగా, శ్రీలంక ఇచ్చిన 264 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి బంగ్లా చేధించింది. ఆ తర్వాత రెండవ వార్మ్ అప్ మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ తో తలపడగా.. ఆఫ్గనిస్తాన్ ఏకంగా ఆరు వికెట్ల తేడాతో ఓడించి మెయిన్ మ్యాచ్ లకు ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
ఇక శ్రీలంక బ్యాటింగ్ లో పర్వాలేదనిపించినా బౌలింగ్ లో మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయింది.. హాసరంగా మరియు తీక్షణలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బౌలింగ్ పై శ్రీలంక మాజీలు పూర్తి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.