వరల్డ్ కప్ లో పాకిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా లు ఈ రోజు చెన్నైలో తలపడుతున్నాయి. అందులో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ కేవలం 270 పరుగుల వద్ద ఉండగా ఆల్ అవుట్ అయింది. పాకిస్తాన్ ఇంత స్కోర్ చేసిందంటే అసలు నమ్మలేని పరిస్థితి.. ఒక దశలో పాక్ కేవలం 141 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో షకీల్ (52) మరియు షాదాబ్ ఖాన్ (43) లు ఆరవ వికెట్ కి 84 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఇన్నింగ్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి 270 పరుగులకు ఆల్ అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లు కీలక సమయంలో పుంజుకుని వికెట్లు తీశారు. లేదంటే పాకిస్తాన్ చాలా ఈజీ గా 300 కు పైగా పరుగులు చేసి ఉండేది. చెన్నై పిచ్ బౌలర్లకు బాగా సహకరిస్తోంది..
సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లోనూ పాకిస్తాన్ బౌలర్లకు సహకరిస్తే విజయావకాశాలు మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి సౌత్ ఆఫ్రికా మరో విజయాన్ని సాధించి సెమీస్ వైపు మరో అడుగు వేస్తుందా చూడాలి.