ప్రపంచ పాల దినోత్సవం రోజున రోగనిరోధక శక్తినిపెంచే పాల పదార్థాల గురించి తెలుసుకోండి..

-

ప్రపంచ పాల దినోత్సవాని ప్రతీ ఏడాది జూన్ 1వ తేదీన జరుపుకుంటారు. ఈ సంవత్సరం పాల విశిష్టతని అది అందించే పోషణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం కరోనా మహమ్మారి వ్యాప్తి విపరీతంగా ఉంది. దీని బారిన పడకుండా ఉండడానికి బయటకి వెళ్ళకపోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ ధరించడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఐతే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కూడా ఇందులో భాగమే. రోగనిరోధక శక్తిని పెంచడంలో పాల ప్రాధాన్యత చాలా ఉందన్న విషయం మీకు తెలుసా? పాలే కాదు పాల పదార్థాలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.

పాలు

చిన్న పిల్లల నుండి పెద్దల వరకు పాలు చాలా ఆరోగ్యకరమైనవి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, జింక్, ప్రోటీన్ ఇంకా ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి.

పెరుగు

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రోబయోటిక్స్ అనగా మేలు చేసే బాక్టీరియా అని అర్థం. ఇది అనేక ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి వాటిని నియంత్రించడంలో సాయపడుతుంది. దీనిలో లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా కారణంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

జున్ను

ఫిన్లాండ్ లోని విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల ప్రకారం జున్నులో అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే ప్రోబయోటిక్ కారణంగా యువకులలో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.

పాలు, పెరుగు, జున్నులో విటమిన్ డి ఉంటుంది. దానివల్ల ఎముకలకు మంచి బలం చేకూరుతుంది. అందువల్ల శరీర వ్యవస్థ చక్కగా ఉంటుంది. ఊపిరితిత్తుల వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అందులో పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version