ఎక్కువ ధరగల వస్తువులను బంగారంలా ప్రియమైనవి అంటాం. కాని బంగారంకంటే
అధిక ధరగల లోహాల్లో రోడియం ఒకటి. తుప్పు పట్టని దీన్ని 1803లో కనుగొన్నారు. న్యూక్లియర్ రియాక్టర్లలో వాడతారు. గ్రాము ఆ బంగారం 56 డాలర్లయితే, రోడియం ధర 58 డాలర్లు. ఈ రెంటికంటే ప్రియమైనది ప్లాటినం. అది అరవై డాలర్లు.
మెథమ్ ఫెటామైన్ అనే స్పటికంలాంటి పదార్థం వీటన్నింటికంటే ఎక్కువ ధర గలది. దానికి గ్రాముకు నూరుడాలర్లు. ఇది మంచులా ఉంటుంది. దీని తయారీ, వినియోగాన్ని ప్రపంచవ్యాప్తంగా అమెరికా నియంత్రిస్తోంది. దీన్ని ఔషధాల్లో ఉపయోగిస్తారు. రైనోమృగం కొమ్ము ధర గ్రాముకు 110 డాలర్లు. దీన్ని ఆయుర్వేదంలో వాడుతారు.
వీటి కంటే ఎక్కువ ధర పలికేది హెరాయినే. దాని ధర గ్రాముకు 130 డాలర్లు. అమెరికాలోకి ఇది స్మగుల్ అవుతుంది. ఇటీవల నైజీరియా నుంచి హైదరాబాదుకు ఇది భారీగా స్మగుల్ అయిందనీ, కొంతమంది ప్రముఖుల పిల్లలు దీన్ని వినియోగిస్తున్నారనే వార్తలు వచ్చాయి. హెరాయిన్ కన్నా ఎక్కువ మత్తును కలిగించే పదార్ధం కొకెయిన్. దీని ధర గ్రాముకి 215 డాలర్లు. ఇది చక్కెరపొడిలా ఉంటుంది. ఎల్.ఎస్.డి. అనే మరో మత్తు పదార్థం ధర గ్రాముకి మూడువేల అమెరికన్ డాలర్లు.
అణుపరిశ్రమలో విరివిగా వాడే ప్లుటోనియం ధర గ్రాముకు నాలుగు వేల డాలర్లు. పైనైట్ లోహం ధర గ్రాముకు తొమ్మిదివేల డాలర్లు. ఇది అత్యంత అరుదైన లోహం. మయన్మార్‌లోనే లభ్యమవుతుంది. 2005 దాకా వంద కిలోల లోపు పైనైట్ లభించింది. రిచర్డ్ టాఫియెట్ అనే మరో మినరాలజిస్టు 1945లో ఓ అలంకరణ లోహాన్ని కనుగొన్నాడు. దీని ధర గ్రాముకి ఇరవై వేలడాలర్లు.
అంతకంటే ఎక్కువ ధర ట్రిటియం అనే లోహానిది. దీని ధర గ్రాముకి ముప్పైవేల డాలర్లు. వజ్రం ధర కారెట్ కు యాభైఐదు వేల డాలర్లు. కేలిఫోర్నియం అనే మరో లోహం ధర గ్రాముకి 2.7కోట్ల డాలర్లు! 1950లో దీన్ని అణుపరిశ్రమ కోసం కేలిఫోర్నియా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.