ఏపీ సీఎం జగన్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు నటుడు విజయ చందర్. ఆయన్ను జగన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టెలివిజన్, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఎ.పి.ఎఫ్.డి.సి) ఛైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే. జగన్ గురించి ఆయన ఏమన్నారంటే..
“ జగన్‌మోహన్ రెడ్డికి చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ఒకప్పుడు ఆయన అభిమాన హీరో బాలకృష్ణ. ఆయన సినిమాలు విడుదలవుతుంటే ఊళ్లో సంబరాలు జరుపుకునేవారు. హీరో సుమంత్, జగన్ కలిసి చదువుకున్నారు. అలా చిత్ర పరిశ్రమతో అనుబంధమున్న జగన్ ఆ రంగ అభివృద్ధి కోసం సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు..అన్నారు విజయ చందర్.
చిత్రీకరణల కోసం ఎలాంటి వసతుల్ని సమకూర్చడానికైనా, పరిశ్రమ కోసం స్థలాలు కేటాయించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు విజయచందర్. ఎ.పి.ఎఫ్.డి.సి డైరెక్టర్‌గా దర్శకుడు సుజీత్ విజయ చందర్ ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తామన్నారు విజయ చందర్.
ఏపీలో సినిమా చిత్రీకరణలకి నేరుగా అనుమతుల్ని ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. పరిమిత వ్యయంతో తెరకెక్కే చిత్రాలకి వారం రోజులపాటు థియేటర్లలో ప్రదర్శించుకునేలా తగిన ఏర్పాట్లు చేయబోతున్నామని వివరించారు విజయ చందర్. తనను ఎఫ్.డి.సి ఛైర్మన్ చేస్తానని వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన మాటను ఇప్పుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని తెలిపారు.