ఆవు.. ఆవు నుంచి వచ్చే ఉత్పత్తులు అన్నీ.. శ్రేష్ఠమైనవే.. మరి అలాంటి ఆవు పాలతో చేసిన నెయ్యి ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా చాలా మంచిదంటున్నారు సౌందర్య నిపుణులు. జుట్టు పోషణకు ఆవు నెయ్యి బాగా ఉపయోగపడుతుందట. నెయ్యిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షిస్తుంది. నెయ్యిని ఉపయోగించడం ద్వారా అనేక జుట్టు సమస్యలను అధిగమించవచ్చు. నెయ్యి జుట్టుకు రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
జుట్టుకు ఆవు నెయ్యి ఉపయోగించడం ద్వారా చుండ్రును తగ్గించుకోవచ్చు. నెయ్యి మలాసెజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వృద్ధిని అడ్డుకుంటుంది. నెయ్యిలో బ్యాక్టీరియా, ఫంగస్‌తో పోరాడే గుణాలు ఉన్నాయి. చుండ్రు నుంచి ఆవు నెయ్యి రక్షిస్తుంది.
నెయ్యిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా.. ఆరోగ్యంగా మారుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే నెయ్యి జుట్టుకు పోషణను అందించడంతో పాటు జుట్టులో తేమను రక్షిస్తుంది.
జుట్టులో పోషకాహార లోపం వల్ల జుట్టు తెగ రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి నెయ్యి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నెయ్యిలో ఉండే పోషకాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల జుట్టు రంగు మారుతుంది. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. మీరు నెరిసిన జుట్టుతో ఇబ్బంది పడుతుంటే.. నెయ్యి జుట్టుకు రక్షణగా నిలుస్తుంది. నెయ్యి రాసుకోవడం వల్ల వెంట్రుకల వేర్లు దృఢంగా మారడంతోపాటు జుట్టు నెరిసిపోవడం ఆగిపోతుంది.
నెయ్యిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం తొలగిపోయి. జుట్టును సులభంగా విడదీస్తుంది. నెయ్యి జుట్టులోని తేమను లాక్ చేస్తుంది. జుట్టు పొడిని తొలగిస్తుంది. సాఫ్ట్ గా సిల్కీగా ఉంటుంది.
ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి… స్వచ్ఛమైన కల్తీలైని ఆవు నెయ్యిని మీరు ఓ సారి హెయిర్ కు ట్రై చేయండి. తినాడనికే దొరకడం లేదు.. ఇంకా జుట్టుకా అనుకుంటారేమో.. మనం హెయిర్ కోసం.. అంతకంటే ఖరీదైనవే కొంటాం… వాటితో పోలిస్తే.. ఆవునెయ్యి ఎంతండి.. సమస్యను రసాయనాలతో కూడిన వాటితో కంటే.. నాచురల్గా పరిష్కరించుకుంటే అది మళ్లీ మళ్లీ పునరావృతం కాదు.