తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్న ఉద్యొగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తికాగా.. ఈ నెల 7న ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను సైతం ఇప్పటికే విడుదల చేశారు..
అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే 93937 11110/93910 05006 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇంకా.. support@tslprb.in కు వివరాలు పంపి పరిష్కారం పొందొచ్చు. అయితే.. దాదాపు 2.40 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఇందు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 503 ఎగ్జామ్ సెంటర్లు, రాష్ట్రంలోని మరో 35 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు…
ఈ పరీక్షలకు హాజరయ్యే వాళ్ళు కొన్ని రూల్స్ ను తప్పక పాటించాలి..ఈ పరీక్షలలో ఎలాంటి అవకతవకలు జరగ కుండా బయో మెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు వారి వేలిముద్రలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో.. బయోమెట్రిక్ నేపథ్యంలో అభ్యర్థులు తమ చేతివేళ్లకు మెహిందీ, టాటూలు లేకుండా చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఎగ్జామ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే.. అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి గంటల ముందే అనుమతించనున్నారు. అయితే.. పరీక్ష ప్రారంభం అయిన ఒక్క నిమిషం లేటు అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు.ఇకపోతే హాల్‌టికెట్లను A4 సైజ్ పేపర్ పైన మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని వేరే పేజీలో కాకుండా అదే పేజీ వెనకవైపు ప్రింటవుట్ తీసుకోవాలని సూచించారు. అయితే కలర్ ప్రింట్ అవసరం లేదు. బ్లాక్ అండ్ వైట్‌లో సరిపోతుందన్నారు..
అలాగే హాల్ టికెట్లకు సూచించిన స్థలంలో ఫోటోను అతికించాలి.దాని పై ఎటువంటి పిన్ ను కొట్టడం కానీ,లేదా మార్క్ చెయ్యకూడదు.సెల్‌ఫోన్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, టాబ్లెట్, చేతిగడియారం, కాలిక్యులేటర్, లాగ్‌టేబుల్, వాలెట్, పర్స్, నోట్స్, చార్ట్, రికార్డింగ్ పరికరాలు, ఖాళీపేపర్లను ఎగ్జామ్ సెంటర్ కు వెంట తీసుకెళ్లవద్దని స్పష్టం చేశారు అధికారులు. ఇంకా నగలు ధరించరాదన్నారు. హ్యాండ్‌బ్యాగ్ ఇంకా పౌచ్ కూడా తీసుకురావద్దని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఏమైనా వస్తువులు తీసుకువస్తే పరీక్షా కేంద్రాల్లో దాచేందుకు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవని స్పష్టం చేశారు..
అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్నులను మాత్రమే ఎగ్జామ్ సెంటర్లలోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు, గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా చేస్తారు జాగ్రత్త..ఎగ్జామ్ బుక్‌లెట్‌లో ఇంగ్లిష్-తెలుగు, ఇంగ్లిష్-ఉర్దూ భాషల్లో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులకు ప్రశ్నల్లో ఏమైనా సందేహాలుంటే ఇంగ్లిష్ వెర్షన్ లో ఉన్న వాటినే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది..ఇవన్ని తప్పక పాటించాలి.. ఆల్ ది బెస్ట్..