కరోనా వైరస్ గత నాలుగు నెలల నుండి ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇండియాలో కూడా ఉన్న కొద్ది ఉధృతంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు బయట పడుతున్న తరుణంలో ఎక్కడా కూడా కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో లాక్ డౌన్ పాటిస్తున్న ప్రజలలో అసహనం నెలకొంటుంది. గంట గంటకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.
ప్రస్తుతం దేశంలో మధ్య తరగతి మరియు పేద ప్రజలు పనులు లేక చేతిలో డబ్బులు లేక ఆహారం కోసం ఎదురుచూపులు చూసే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం దేశంలో నడుస్తూ ఉండగా బయో ఇంధనం ద్వారా సన్న బియ్యం నుండి శానీ టైజర్ తీసుకోవచ్చు అంటూ అనుమతులు ఇవ్వటంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. జనాలు ఆహారం లేక ఆకలి కేకలు ఇళ్లల్లో పెడుతుంటే కేంద్రం ఏ విధంగా ఈ నిర్ణయం తీసుకుంటుందని ప్రతి పక్షాలు అంటున్నాయి. అంతగా ధాన్యం కేంద్రం దగ్గర ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు ఈ సమయంలో ఉచితంగా పంపిణీ చేయాలని అంటున్నారు.