చెన్నై వేదికగా మోదీ, జిన్‌పింగ్ భేటీ..

-

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య 11, 12వ తేదీల్లో చెన్నై వేదిక‌గా భేటీ కానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇరు దేశాధినేతలకు ఇది రెండో అనధికారిక సదస్సు. గత ఏడాది ఏప్రిల్‌లో వుహాన్‌లో జరిగిన తొలి అనధికారిక సదస్సులో వీరు కలిశారు. ఇరువురు కలిసి సదస్సును ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. ఈ నెల 11, 12న జరిగే రెండవ అనధికారిక సదస్సులో పాల్గొననున్నారు.

చెన్నైలో జరగబోయే అనధికారిక సదస్సులో ప్రధానిమోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కలవనున్నారు. ఈ సదస్సులో ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలపై ఇరు దేశాల ఆలోచనలను, సహకారాన్ని గురించి చర్చించనున్నారు’’ అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version