యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. మత్స్యాలంకరణలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం

-

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వేడుకల్లో భాగంగా మూడో రోజైన ఇవాళ లక్ష్మీనరసింహ స్వామి మత్స్యాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలకు భక్తులు అధికంగా పోటెత్తడంతో ఆలయంలో రద్దీ నెలకొంది.

శ్రీదేవి, భూదేవితో భగవంతుడు ఆదిశేషుడిపై విహరిస్తూ రాత్రి 7 గంటలకు భక్తులకు కనువిందు చేస్తారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ప్రధానాలయంలో ఉదయం అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం.. సాయంత్రం భేరీపూజ, దేవతాహ్వానం, హవన కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక పూజా కైంకర్యాలు, నరసింహ స్వామి నామస్మరణలతో గుట్ట మార్మోగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version